ఏడీఈకి వినతి పత్రం అందజేత……

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని, గురువారం చిట్యాల గ్రామపంచాయతీ 4 వార్డ్ మెంబర్ తౌటం నవీన్ సబ్ స్టేషన్ లో ఏడిఈ సుందర్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. చిట్యాల సర్పంచ్ తౌటం లక్ష్మి ఆదేశానుసారం , గ్రామపంచాయతీ పరిధిలోని 10 విద్యుత్ సమస్యలపైన గ్రామపంచాయతీ పాలకవర్గం, 4వ వార్డు సభ్యుడు తౌటం నవీన్ వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలోని నూతన విద్యుత్ స్తంభాలు, కరెంట్ తీగలు, ఏర్పాటు చేయాలని , సమస్యలపై దృష్టి సారించి త్వరిత గతిన ఏర్పాటు చేయాలని కోరగా, అధికారి సానుకులంగా స్పందించినట్లు నవీన్ తెలిపారు .

Leave a Reply