శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి…

మునుగోడు, ఆంధ్రప్రభ : మూఢనమ్మకాలను వ్యతిరేకించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని ప్రజలకు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా రాజా, విజ్ఞాన దర్శిని ఫౌండర్ రమేష్,సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం పిలుపునిచ్చారు. ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామంలో మార్కిస్ట్ కార్యకర్త కామ్రేడ్ సింగపంగ ముత్తమ్మ స్తూపాన్ని ఆవిష్కరించారు.
అనంతరం డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి అధ్యక్షత సంస్మరణ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబద్ధత కలిగిన మార్కిస్ట్ కార్యకర్త కామ్రేడ్ సింగపంగ ముత్తమ్మ లేకపోవడం పార్టీకి, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ముత్తమ్మ జీవితాంతం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సమస్యలపై పోరాడిన నిబద్ధత కలిగిన కార్యకర్తగా నిలిచారని కొనియాడారు.
అంగన్వాడి ఆయాగా పనిచేస్తూ కార్మికుల సమస్యలపై పోరాటాల్లో పాల్గొన్న ముత్తమ్మ ప్రజా ఉద్యమాలకు సేవలందించారని గుర్తుచేశారు.అనంతరం ఆమె కుమారుడు కోడలు సింగపంగ లింగస్వామి, డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ముత్తమ్మ ఆశయాల సాధన కోసం తమవంతు కృషి చేస్తామని తెలిపారు.తాము మరణించిన తరువాత తమ పార్ధివ దేహాలను మెడికల్ కళాశాలకు దానం చేస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సైన్స్ కమ్యూనికేషన్ సబ్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ రామచంద్రయ్య, జన విజ్ఞాన వేదిక సమత సబ్ కమిటీ మెంబర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి, జె వి వి రాష్ట్ర కార్యదర్శి నన్నూరి వెంకటరమణారెడ్డి, టిపిటిఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అయిత విజయ్ కుమార్,గ్రామ సర్పంచ్ సింగపంగ లక్ష్మమ్మ,సిపిఎం జిల్లా నాయకులు చాపల మారయ్య, సిపిఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, సిపిఎం గ్రామ కార్యదర్శి పగిళ్ల మధు, సిపిఎం సీనియర్ నాయకులు నారగోని నరసింహ, అయితగొని యాదయ్య గౌరయ్య, ఎల్లయ్య, సుందరయ్య, ఆంజనేయులు,విజయ్ కుమార్,విజయ, యాదయ్య,అలివేలు తదితరులు పాల్గొన్నారు.
