ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రాప్తాడు, ఆంధ్రప్రభ: గ్రామాల్లో ఎటు చూసినా పచ్చజెండా పండుగ సంబరాలే కనిపిస్తున్నాయని టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జ్ సోమర నారాయణస్వామి, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

రాప్తాడు మండల పరిధిలోని జి.కొత్తపల్లి, గాండ్లపర్తి గ్రామాలతో పాటు మరో 14 గ్రామ పంచాయతీలలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేసి కేకులు కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నదని తెలిపారు. పేదవాడి ఆకలి తీర్చడమే ధ్యేయంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, నేటికీ అదే స్ఫూర్తితో పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేయాలంటే తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. ప్రజల పార్టీగా టీడీపీ నిలిచిందని, కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు తప్పక లభిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జ్ సి. నారాయణస్వామి, గాండ్లపర్తి సర్పంచ్ నరేష్, లక్ష్మీనారాయణ, రామానాయుడు, ప్రతాప్ రెడ్డి, మనోహర్ నాయుడు, ఎ. రమేష్, మహేంద్ర, సోమర మోహనప్ప, వేణుగోపాల్, ఇంటూరి వెంకటేష్, నల్లప్ప, ఆదినారాయణ, ఇల్లూరి నాగరాజు, ఎన్టీఆర్ అభిమానులు, ఆయా గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.