సింహవాహనంపై ఊరేగిన శ్రీవారు

సింహవాహనంపై ఊరేగిన శ్రీవారు
భక్తులతో కిటకిటలాడిన దేవాలయం
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సింహవాహనంపై శ్రీవారు భక్తులకు దర్శించారు. సుప్రభాత సేవలో భాగంగా దేవాలయంలో తెల్లవారుజా మున స్వామివారికి అభిషేకం వివిధ పుష్పాలతో అలంకరించారు. అర్చనలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.
ఉభయ దాతలు కీర్తిశేషులు అమిలి నేని వెంకటప్ప గారి కుమారులు సురేంద్ర అండ్ బ్రదర్స్ ఎస్ ఆర్ సి అనంతపురం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, దేవాలయ ప్రాంగణంలో భాజా భజంత్రీల నడుమ స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగించారు. అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సింహ వాహనంపై ఉత్సవమూర్తులను కు కొలవదీర్చారు.

మాడవీధులలో స్వామివారిని ఊరేగించారు. స్వామివారి దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో, దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఈవో సాకే రమేష్ బాబు, అర్చకులు ద్వారకనాథ్ చార్యులు, బాలాజీ చార్యులు, గుండురావు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.
