బీజేపీ నాయకులు ముందస్తుగా అరెస్ట్..
గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర పార్టీ ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో మండల కేంద్రానికి చెందిన బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు రావుల ఎల్లప్ప,చిలువేరు దుర్గయ్య, కొంగరి నరహరి, పగిళ్ల శంకరును అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేయవలసింది అరెస్టులు కాదని ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను అమలు చేయాలని సూచించారు.
