కోడూరులో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజల పరుగులు

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలంలోని కోడూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు భారీగా ఎగబడిన ఘటన చోటుచేసుకుంది. ఇటీవల గ్యాస్ కొరత ఉందన్న వార్తలతో గ్రామస్థులు ముందుగానే సిలిండర్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో భరత్ గ్యాస్ సరఫరా ఆటో గ్రామానికి చేరుకున్న వెంటనే పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని సిలిండర్ల కోసం పోటీ పడ్డారు.

కొందరు ఉదయం నుంచే ఆటో కోసం ఎదురుచూస్తుండగా, సమాచారం అందుకున్న వెంటనే మరికొందరు అక్కడికి చేరడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. స్థానికుల ప్రకారం గత కొన్ని రోజులుగా గ్యాస్ సరఫరా అంతరాయం కలగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, అవసరానికి మించి బుకింగ్‌లు చేయడం కూడా కొరతకు కారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు కూడా ఆందోళన చెందకుండా అవసరానికి అనుగుణంగా మాత్రమే బుకింగ్‌లు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Leave a Reply