కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి
ఇంద్రకీలాద్రి ,ఆంధ్రప్రభ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి డాక్టర్ ఎం. హరిజవహర్ లాల్ మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారును దర్శించుకున్నారు. ఆలయానికి మంగళవారం విచ్చేసిన ఆయనకు దేవస్థానం అర్చక బృందం సంప్రదాయబద్ధమైన ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికింది.
అనంతరం డాక్టర్ హరిజవహర్ లాల్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఉప ప్రధాన అర్చకులు శంకర్ శాండిల్య అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాలను అందజేశారు.
