అప్పుల బాధతో వివాహిత ఆత్మహత్య

వలిగొండ, ఆంధ్రప్రభ : భర్త చేసిన అప్పుల వేదింపులు తాళలేక ఓ వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండమండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం గ్రామానికి చెందిన పానుగంటి భాస్కరాచారి ఫిర్యాదు మేరకు తన చెల్లెలు దాసోజు రూప (40)కు 20 ఏళ్ల క్రితం వలిగొండకు చెందిన దాసోజు వెంకటాచారితో వివాహం జరిగింది.

బంగారు నగల వ్యాపారి అయిన వెంకటాచారి గత మూడేళ్లుగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక ఊరు విడిచిపెట్టడంతో అప్పుల వాళ్లు తరచూ ఇంటికి వచ్చి రూపను వేదించేవారు.మానసిక ఒత్తిడి తట్టుకోలేక సోమవారం ఉదయం 9:40 గంటలకు రూప ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుంది. విషయం తెలుసుకున్న సోదరుడు భాస్కరాచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని ఎస్ ఐ.యుగేందర్ దర్యాప్తు చేస్తున్నారు.