జూలై 26న శ్రీ కనకదుర్గమ్మకు తెలంగాణ బోనాల సమర్పణ
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: హైదరాబాద్–భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యుల బృందం ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. అనంతరం బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)ను కలిసి, గత 16 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది కూడా శ్రీ కనకదుర్గ అమ్మవారికి తెలంగాణ బోనాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు జూలై 26న హైదరాబాద్ నుంచి విచ్చేసి బోనాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేస్తూ ఆలయ చైర్మన్‌కు సమాచారం లేఖను అందజేశారు.
