బ్యాటరీ దొంగలను అరెస్ట్ చేసిన సంగెం పోలీసులు

బ్యాటరీ దొంగలను అరెస్ట్ చేసిన సంగెం పోలీసులు

సంగెం, ఆంధ్రప్రభ: మమ్నూర్, పర్వతగిరి, వర్ధన్నపేట ప్రాంతాల్లో గత వారం రోజులుగా జరుగుతున్న బ్యాటరీ దొంగతనాలను సంగెం పోలీసులు ఛేదించారు. ఈ నెల 9, 10 తేదీల్లో గావిచర్ల, రామచంద్రపురం, తిమ్మాపూర్ గ్రామాల్లో జరిగిన స్వర్గ రథం బ్యాటరీల దొంగతనాలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పర్వతగిరి సీఐ రాజగోపాల్ సూచనల మేరకు ఎస్సై వంశీ కృష్ణ తన హెడ్ కానిస్టేబుల్ సంతోష్, కానిస్టేబుల్స్ బాబు, శ్రవణ్, నవీన్ కిషోర్, వీరన్నలతో కలిసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

నమ్మదగిన సమాచారం మేరకు తిమ్మాపూర్ సబ్‌స్టేషన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు నిందితులు గూడూరు అరవింద్, హింగిరి బన్నీ (తీగరాజుపల్లి)లను అరెస్ట్ చేశారు. వీరు స్కూటీపై ఆరు దొంగిలించిన బ్యాటరీలను తరలిస్తుండగా పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు.

విచారణలో వారు 9, 10 తేదీల్లో మమ్నూర్, పర్వతగిరి, ఉప్పరపల్లి, గావిచర్ల, రామచంద్రపురం, తిమ్మాపూర్ ప్రాంతాల్లో స్వర్గ రథం బ్యాటరీలను దొంగతనం చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. వీటిని వరంగల్‌లో అమ్మేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

నిందితుల వద్ద నుంచి ఆరు బ్యాటరీలు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సై వంశీ కృష్ణతో పాటు పోలీస్ సిబ్బందిని అభినందించారు.

Leave a Reply