WGL | గాలి వాన బీభత్సం.. నెలకొరిగిన వృక్షాలు !

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈరోజు (బుధవారం) రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా జిల్లాల్లో చాలా చోట్ల విద్యుత్ తీగలు తెగిపడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

గణపురం మండల కేంద్రంలోని మండల రోడ్డులో ఓ ఇంటిపై చెట్టు కూలిపోయింది. దీంతో రేకుల షెడ్డు పూర్తిగా ద్వాంసం అయింది. ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు తృటిలో తప్పించుకోగా, మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

అదేవిధంగా, గణపురం మండలంలో రోడ్డుపై భారీ చెట్టు కుప్ప‌కూలింది. స్థానిక ఎస్ఐ రేఖ అశోక్ కుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో కూలిన చెట్లను తొలగించి రవాణా సౌకర్యాలను పునరుద్ధరించారు.

Leave a Reply