పర్యావరణం కాపాడుదాం.. ప్లాస్టిక్ నిర్మూలిద్దాం..

పర్యావరణం కాపాడుదాం.. ప్లాస్టిక్ నిర్మూలిద్దాం..

వందన హైస్కూల్ విద్యార్థుల ర్యాలీ

కరీమాబాద్, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం అని శివనగర్ వందన హైస్కూల్ కరెస్పాండెంట్ హెచ్ఎం ఆడెపు శ్యామ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా సోమవారం శివనగర్లో కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి ఆధ్వర్యంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వందన హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ రాజు, కరెస్పాండెంట్ ఆడెపు శ్యామ్ మాట్లాడుతూ నగరం పరిశుభ్రంగా ఉండటంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని వారు అన్నారు.

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తడి పొడి చెత్త వేరువేరుగా పారిశుద్ధ కార్మికులకు అందించాలని వారు గృహ యజమానులకు అవగాహన కల్పించారు. సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు పరిసరాల పరిశుభ్రతకు ప్రజలందరూ సహకరించాలని ప్లాస్టిక్ ను సంపూర్ణంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే డివిజన్ ప్రజలందరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించగలరని వారు తెలిపారు. కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ రాజు, జవాన్లు సుమన్, శివకృష్ణ, కార్పొరేటర్ పిఏ అంజయ్య, డివిజన్ ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply