జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం..

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోమల్ల గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు తండ్రి హళావత్ బాలాజీ, కుమారుడు హళావత్ నరేష్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వెనుకనుండి వాహనం బలంగా ఢీకొంది. ఈ ఘటనలో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన కుమారున్ని ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply