ఎడపల్లి మండలంలో అకాల వర్షం…
ఎడపల్లి మండలంలో అకాల వర్షం…
ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలంలో ఆదివారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. పొద్దున నుండి ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒకసారిగా మారిపోయింది. ఆకాశం లో దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. సాయంత్రం 6 గంటలకు ఒక్క సారిగా చిరు జల్లు కురిసింది. బంగాళా ఖాతం లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. కాగా వర్షం మూలంగా ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

