10 పరీక్షలకు అన్ని సిద్ధం : ఎంఈఓ మల్లికార్జున

10 పరీక్షలకు అన్ని సిద్ధం : ఎంఈఓ మల్లికార్జున
రాప్తాడు, ఆంధ్రప్రభ : పదవ తరగతి పరీక్షలకు కేటాయించిన సెంటర్లలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఎంఈఓ మల్లికార్జున పేర్కొన్నారు. రాప్తాడు మండల కేంద్రం నుండి ప్రకటన విడుదల చేశారు. రాప్తాడు ఎంఈఓ మల్లికార్జున పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని ఆల్ ది బెస్ట్ తెలిపారు.అలాగే మండలంలోని 4 సెంటర్లు మోడల్ స్కూలు (పంగల్ రోడ్డు) ఆర్డీటి హైస్కూలు విన్సెంట్ డీఫాల్ హైస్కూలు ఎల్లార్జీ హై స్కూళ్ళలో పదే పదే తనిఖీలు చేసి శుభ్రత పరిశుభ్రతను పరిశీలించామని తెలిపారు. రూములు ఫ్యాన్లు టేబుల్లు కుర్చీలు సిద్ధం చేశామన్నారు.
అలాగే హెడ్మాస్టర్లకు తగిన సలహాలు సూచనలు అందించాం. నేటి నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు ఏర్పాటు చేయమన్నారు.వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆటోలను అందుబాటులోకి తెచ్చామన్నారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాలు వద్దకు చేరుకోవాలని తెలియజేశారు.
