ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు..

జుక్కల్, ఆంధ్రప్రభ : దళితులు,బడుగు బలహీన వర్గాల ప్రజలకోసం, తమ జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు బి.ఆర్ అంబేద్కర్ అని లొంగన్ గ్రామ సర్పంచ్ నాగల్గిద్దె ఉషారాణి అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం లొంగన్ గ్రామంలో కార్యదర్శి అనురాధ గ్రామస్తులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సమసమాజ స్థాపన, పౌరుల హక్కులకు తమ రాజ్యాంగం ద్వారా చట్టబద్ధత కల్పించి, దేశానికి ప్రజలకు ఎనలేని సేవలు చేశారని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు సదాశివ్ పటేల్, గ్రామస్తులు పాల్గొన్నారు.
