ఘనంగా ఉద్యోగ విజయోత్సవాలు

ఘనంగా ఉద్యోగ విజయోత్సవాలు

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : మండలం లోని చిన్న ముష్టూర్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం కళాశాల ఉద్యోగ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిన్న ముష్టూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఆశ్రఫ్ అలీ, ఎలైట్ ప్యాక్ కంపెనీ అధినేత రోహిత్, డిప్యూటీ ఎంపీడీవో మహమ్మద్ రఫీలు హాజరయ్యారు. కళాశాలకు చెందిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు 6 మంది రాయల్ ఎన్ఫీల్డ్ , 6 మంది అభి షోవాటెక్ , చెన్నై, కీమ్ లిమిటెడ్, హిందూపురం ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రాంగణ అధికారి నరసింహులు ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శాకాధిపతులు డాక్టర్ నిత్య లావణ్య, డాక్టర్ నరసింహారెడ్డి, డాక్టర్ సులోచనలు మాట్లాడుతూ దీర్ఘకాల లక్ష్యముతో పరిశ్రమ లో సాంకేతిక పరిజ్ఞానంతో పని చేయాలని జాతికి ఉపయోగపడే ఆవిష్కరణల కు మగ్గుచూపాలని ఉద్భోదించారు.

Leave a Reply