పోగుచేసిన తలనీలాలు హక్కుకు బహిరంగ వేలం

పోగుచేసిన తలనీలాలు హక్కుకు బహిరంగ వేలం

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్ర మైన పెన్నాహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఉరవకొండ ఇన్స్పెక్టర్ రాణి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో పోగుచేసిన తలనీలాలు హక్కుకు షీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించినట్లు ఆలయ ఈవో సాకే రమేష్ బాబు తెలిపారు. కలగలపు బియ్యం బేడలు విక్రయించుకొను హక్కుకు బహిరంగ వేలం నిర్వహించగా, వేలంలో నలుగురు డిపాజిట్టు కట్టగా, అందులో ముగ్గురు వేలం పాట పాడినారు.

గతంలో పాట కంటే తక్కువ పాట వచ్చినందున, సరైన పాట రానందున వేలం వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. 2025 ఆగస్టు 13 నుండి 2026 ఫిబ్రవరి 4 తేదీ వరకు ప్రోగు చేసిన తలనీలాలు హక్కుకు షీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించగా, 5 మంది పాటదారులు డిపాజిట్టు కట్టగా, ముగ్గురు పాట పాడినారు. హెచ్చుపాట దారుడు పామిడి ఓబులేష్ 1, 61 వేల రూపాయలకు పాట దక్కించుకున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంద్రావతి సుధాకర్, ధర్మకర్త మండలి సభ్యులు పెద్ద ముష్టూర్ రామక్రిష్ణ, ధర్మకర్త ధనుంజయ ఆచారి, బొల్లినేని ఓబులేష్, మాజీ సర్పంచ్ మోపిడి గోవిందు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply