శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు..

శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు..
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఉరవకొండలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ విజన్ యూనిట్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి పద్మావతి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూల మాలలు ఘనంగా నివాళులు అర్పించారు.నపట్టణంలోని బళ్ళారి రోడ్డు లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. రాజధాని అమరావతి తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటుతో 58 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నియోజక వర్గ విజన్ యూనిట్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు లైవ్ కార్యక్రమాన్ని వీక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవి ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో సతీష్ కుమార్, ఏవో శంకర్, ఇన్చార్జ్ తహసిల్దార్ భోగన్న గౌడ్, ఎంపీపీ నరసింహులు, వ్యాసాపురం గ్రామ సర్పంచ్ సీతారాముడు, ఉరవకొండ సింగల్ విండో అధ్యక్షులు ప్యారం కేశవానంద, ఉరవకొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయ భాస్కర్, వరప్రసాద్, టిడిపి రాజేష్, సీనియర్ అసిస్టెంట్ రవికుమార్, జూనియర్ అసిస్టెంట్ జావిద్, నియోజకవర్గ విజన్ యూనిట్ సిబ్బంది రామ్ రహీం, రాందాస్ నాయక్, హేమంత్, అబ్ రార్, అనిల్ కుమార్, జాషువా, హరి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
