ఈఎంటీ అప్రమత్తతతో తల్లీబిడ్డలు క్షేమం

ఇంద్రవెల్లి (ఆంధ్రప్రభ): అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గర్భిణిని ప్రసవం కోసం ఆదిలాబాద్‌కు 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలోని మావల సమీపంలో ఆమెకు తీవ్ర ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి. పరిస్థితిని గమనించిన 108 సిబ్బంది వెంటనే అప్రమత్తమై అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం నిర్వహించారు.

ఈఎంటీ బి. సిద్ధేశ్వర్ చాకచక్యంగా ప్రసవం నిర్వహించగా, పైలట్ ఎస్.కే. సాహిద్ సహకారం అందించారు. అనంతరం తల్లి, నవజాత శిశువును మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.