ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన టీడీపీ శ్రేణులు..

ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన టీడీపీ శ్రేణులు..
మినీ మహానాడులో హైబ్రిడ్ ఉత్సాహం
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: ఉరవకొండ నియోజకవర్గంలోని రాకెట్లలో 6వ క్లస్టర్‌లో బుధవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమం హైబ్రిడ్ విధానంలో ఘనంగా సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమాన్ని ఉరవకొండ మినీ మహానాడు ఇన్‌చార్జ్ మల్లెల రాజశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు.
తెలుగుదేశం పార్టీ మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాధాన్యం ఇస్తోందని, మహిళా సాధికారత, భద్రత కోసం నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్‌కు పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.
హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వీక్షించారు. పసుపు జెండాలతో వేదిక వాతావరణం ఉత్సాహభరితంగా మారింది.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వెంకటనారాయణ, నెట్టెం రామకృష్ణ, నెట్టెం రామ్మోహన్, శివ, కన్వీనర్ మోపిడి గోవిందు, మాజీ ఎంపీపీ సుంకర రత్నమ్మ, సూరి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
