బాబా మహా సమాధిని దర్శించుకున్న నారాలోకేష్

బాబా మహా సమాధిని దర్శించుకున్న నారాలోకేష్

పుట్టపర్తి ఆంధ్రప్రభ : శ్రీసత్యసాయి జిల్లాలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటనలో భాగంగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలోని బాబామహా సమాధిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం మంత్రి లోకేష్ ప్రశాంతి నిలయం చేరుకోగా అక్కడ ఆయనకు ట్రస్ట్ వర్గాలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సాయి కుల్వంత్ మందిరంలోని శ్రీభగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సత్య సాయి జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా అధ్యక్షులు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టిడిపి స్టేట్ మీడియా కోఆర్డినేట్ బి.విరాముడు తదితరులు కలరు. మరి కాసేపట్లో పుట్టపర్తిలో ఐదో తరం అడ్వాన్స్ డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాప్ట్(ఏఎంసీఏ) తయారీ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి లోకేష్. ఏఎంసీఏ ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్, ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ, ఇతర రక్షణరంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం చంద్రబాబునాయుడు తో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి నారాలోకేష్

Leave a Reply