పెద్ది కుటుంబాన్ని పరామర్శించనున్న గులాబీ బాస్
హనుమకొండ (ఆంధ్రప్రభ): వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఈ నెల 9న నల్లబెల్లిలో పరామర్శించనున్నారు. అదే రోజు నిర్వహించే సంస్మరణ సభలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొననున్నారు.
ఈనెల 10న హనుమకొండలో నిర్వహించే మరో కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లపై తెలంగాణ భవన్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలు సమావేశమై సమీక్ష నిర్వహించి, విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
