గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం

గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం
ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలి
ఇప్ఫగూడెం పీహెచ్‌సీలో ప్రత్యేక వైద్య నిపుణుల శిబిరం
శిబిరాన్ని పరిశీలించిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధీర్ కుమార్
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధీర్ కుమార్ సూచించారు. స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్ఫగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్య నిపు ణుల శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, పిల్లల, కంటి వైద్యం, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, దంత వైద్య విభాగాలకు చెందిన మొత్తం ఆరుగురు నిపుణులు పాల్గొని రోగులను పరిశీలించి అవస రమైన వైద్య సేవలు అందించారు. శిబిరాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధీర్, పీఓ ఎంసిహెచ్ డాక్టర్ శ్రీహర్ష పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించి సిబ్బందికి అవసరమైన సూచన లు ఇచ్చారు.
అనంతరం పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి ప్రణీత మాట్లాడుతూ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నిపుణుల వద్ద ఉచిత వైద్య పరీక్షలు చేయించుకుని అవసరమైన చికిత్సలు ఆరో గ్య సూచనలు పొందారన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఇటువంటి ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మందపురం రాణి అనిల్ గౌడ్, పిహెచ్ఎన్ రమణ, హెచ్ఈఓ భగవాన్ రెడ్డి, ఎఎన్ఏం లు సునీత, రాజ్యలక్ష్మి, రేఖ, వనజ, ఆశ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.
