ఎర్రబెల్లి దంపతుల గోల్డెన్ జూబ్లీ వివాహ వార్షికోత్సవ వేడుకలు

ఎర్రబెల్లి దంపతుల గోల్డెన్ జూబ్లీ వివాహ వార్షికోత్సవ వేడుకలు

  • అంగరంగ వైభవంగా నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు
  • కోలాటాలతో ఘన స్వాగతం పలికిన మహిళలు
  • పాలకుర్తి,వర్ధన్నపేట ప్రజలు చూపుతున్న ఆప్యాయత ఆదరణ మాకు గర్వకారణం
  • ప్రజా సేవలో నూతన ఉత్సాహంతో మీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాను
  • మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రాయపర్తి, ఆంధ్రప్రభ : మండలంలోని వెంకటేశ్వరపల్లిలో తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు దైవ సన్నిధిలో బంధుమిత్రులు, స్నేహితులు,శ్రేయోభిలాషులు, కార్యకర్తల మధ్య ఘనంగా 50వ (సిల్వర్ జూబ్లీ) వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

గురువారం వెంకటేశ్వరరావు పల్లి లోని స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహించిన వివాహ వార్షికోత్సవ వేడుకల్లో ఎర్రబెల్లి దంపతులకు మహిళలు కోలాటాల, నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించగా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేసి, కనులారా స్వామివారి కళ్యాణం తిలకించారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భోజనాలను భక్తులకు వడ్డించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మాకు ఎంతో ఆనందమైన ఈ జీవితం ప్రజలకు అంకితం అని వర్ధన్నపేట,పాలకుర్తి ప్రజలు చూపుతున్న ఆప్యాయత ఆదరణ మాకు చాలా గర్వకారణమని భవిష్యత్తులో ప్రజా సేవలో మరింత శ్రద్ధ పెట్టి మీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారని అన్నారు.

అనంతరం బంధుమిత్రులు,నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు బొకేలు,పూలమాలలు, శాలువాలు కప్పి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మునావత్ నరసింహ నాయక్, మాజీ ఎంపీపీ జీనుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పిటిసి రంగు కుమార్ గౌడ్, బిఆర్ఎస్ మండలం పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మదు, నియోజకవర్గ నాయకులు పల్లాసుందర్ రామ్ రెడ్డి,బబ్బురి శ్రీకాంత్ గౌడ్, పుస్కూరి శ్రీనివాసరావు, మంగళపల్లి శ్రీనివాస్, జిల్లా,మండల,గ్రామ ముఖ్య నాయకులు,సోషల్ మీడియా నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply