ఘనంగా ఎంపీ కడియం కావ్య జన్మదిన వేడుకలు

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం వరంగల్ ఎంపీ కడియం కావ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎంపీ కడియం కావ్య ఆశీస్సులు నియోజకవర్గంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బూర్ల శంకర్, అంబటి కిషన్ రాజు, వైస్ చైర్మన్ నీల రాజమ్మ-గట్టయ్య, కౌన్సిలర్లు గట్టు సంగీత, పొన్నం స్వరూప, గుర్రం హైమ, పెసరు కృష్ణవేణి, పొన్నం రవి, తాటికొండ ఉప సర్పంచ్ ఎడమ కట్టమల్లు, నాయకులు వక్కల రాజు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply