108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ

మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని అపర సంజీవని 108 అంబులెన్స్‌ను జిల్లా అధికారులు ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రోగ్రామ్ మేనేజర్ ఎస్‌కే సలీం, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రదీప్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నర్మదా కలిసి సిబ్బంది పనితీరు,అత్యవసర వైద్య పరికరాలను పరిశీలించారు. అంబులెన్స్‌లో ఉన్న ఆధునిక పరికరాలు, అత్యవసర సేవలపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

రానున్న వేసవికాలంలో వడదెబ్బ, ఇతర అత్యవసర కేసులు పెరిగే అవకాశమున్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బ బాధితులకు తక్షణ చికిత్స అందించేందుకు ఐస్ బాక్స్,టవల్స్,ఓఆర్ఎస్ వంటి సామగ్రి అందుబాటులో ఉంచినట్లు 108 సిబ్బంది తెలిపారు. ప్రతి నెల సుమారు 120 కేసులకు 108 అంబులెన్స్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఇందులో రోడ్డు ప్రమాదాలు,స్ట్రోక్, ఛాతి నొప్పి,పక్షవాతం, విషప్రయోగం,డెలివరీ, పాము కాటు తదితర అత్యవసర కేసులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు 108 అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గుంటి రమేష్,నల్లగంటి వరప్రసాద్,పైలట్ ఎండి గాలిబ్,ఎస్‌కే మునీర్ పాల్గొన్నారు.

Leave a Reply