గిడ్డంగులలో ధాన్యం నిల్వతోనే రైతులకు మేలు

గిడ్డంగులలో ధాన్యం నిల్వతోనే రైతులకు మేలు

గరిడేపల్లి, ఆంధ్రప్రభ: రైతులు తాము పండించిన పంటను గిడ్డంగులలో భద్రపరుచుకోవడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ డా. ఏ మరియాదాస్ అన్నారు. శుక్రవారం గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం లో WDRA, నెగోషియబుల్ వేర్ హౌస్ అంశాలపై రైతులు, వ్యాపారులకు నిర్వహించిన అవగాహన సదస్సు లో పాల్గొని మాట్లాడారు .

​సరైన నిల్వ పద్ధతులు పాటించకపోవడం వల్ల ఎలుకలు, పురుగుల ద్వారా 10 నుంచి 30 శాతం ధాన్యం నష్టపోతున్నారని తెలిపారు. హెర్మటిక్ బ్యాగుల వినియోగం ద్వారా ధాన్యాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చన్నారు. కేవీకే సైంటిస్ట్ డి. ఆదర్శ్ మాట్లాడుతూ.. గోదాముల్లో నిల్వ చేసిన ధాన్యానికి లభించే రిసిప్ట్ ద్వారా బ్యాంకుల నుండి రుణాలు పొందవచ్చని, అలాగే ఈ-నామ్ ద్వారా ఆన్‌లైన్‌లో పంటను అమ్ముకునే వీలుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సైంటిస్టులు ఏ. కిరణ్, అక్షిత్ సాయి, సుగంధి మరియు 50 మంది రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply