వడదెబ్బతో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన కాంటేకార్ వెంకటేష్(47) వడదెబ్బతో ఆదివారం మృతి చెందారు. మృతునికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. పేద కుటుంబానికి చెందిన వెంకటేష్ మృతి నా కుటుంబానికి తీరని విషాదాన్ని, నష్టాన్ని మిగిల్చిందని బంధుమిత్రుల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున వెంకటేష్ కుటుంబాన్ని ఆదుకునేలా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చొరవ తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. వెంకటేష్ మృతి పట్ల మాజీ సర్పంచ్ ఆకవరం మోహన్ రావు సంతాపం ప్రకటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.