ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
కృష్ణలంక విజయవాడ, ఆంధ్ర ప్రభ : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 16 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణ లంక 22 వ డివిజన్ పరిధి లోని స్ధానిక కార్పొరేటర్, రాష్ట జాయింట్ సెక్రటరీ తాటి ప్రతి కొండా రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు కోత మిషన్ రోడ్డులో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని జెండా కార్యక్రమం చేసి కేక్ కటింగ్ పండ్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ ముఖ్యనాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
