47th Division | కనకదుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

47th Division | కనకదుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

ముఖ్య అతిథిగా బుద్ధా వెంకన్న హాజరు
ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ

47th Division | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని వించిపేట రెల్లి వీధిలో కొండపై ఉన్న శ్రీశ్రీశ్రీ కనకదుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. శుభ ముహూర్తంలో జరిగిన భూమి పూజా కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 46వ డివిజన్ టీడీపీ నాయకులు గుర్రంకొండ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

పూజా కార్యక్రమం అనంతరం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన సహాయం అందించేందుకు విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని‌తో మాట్లాడతానని చెప్పారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను తప్పకుండా హాజరవుతానని, తనతో పాటు ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని‌ను కూడా తీసుకువస్తానని హామీ ఇచ్చారు.

47th Division |

ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ సీనియర్ నాయకుడు నాగోటి రామారావు, రెల్లి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తుపాకుల రమణమ్మ, 46వ డివిజన్ అధ్యక్షుడు లోకేష్, ప్రధాన కార్యదర్శి ధనాల శ్రీనివాసరావు, ఆర్ఎఫ్ కమిటీ సభ్యులు నిమ్మకాయల రమణమూర్తి, మీసాల ఏడుకొండలు, 50వ డివిజన్ టీడీపీ నాయకుడు గంగాధర్ పాల్గొన్నారు. అలాగే శ్రీశ్రీశ్రీ కనకదుర్గాదేవి ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

47th Division |

CLICK HERE TO READ MORE : భారీ అక్రమ రేషణ్ మాఫియా గుట్టు రట్టు

CLICK HERE TO READ MORE

Leave a Reply