ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత తంగిరాల ప్రభాకర్‌రావు…
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత తంగిరాల ప్రభాకర్‌రావు…
ఎంపీ, ఎమ్మెల్యే, మాజీమంత్రి
ఘనంగా తంగిరాల ప్రభాకరరావు కాంస్య విగ్రహావిష్కరణ
కంచికచర్ల, ఆంధ్రప్రభ : పేదరికం నుంచి అంచలంచలుగా ఎదిగి, రాజకీయ రంగంలో తన సేవలతో ప్రజల హృదయాలను గెల్చుకున్న మహానేత దివంగత తంగిరాల ప్రభాకరరావు అని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి దేవినేని ఉమా కొనియాడారు. తంగిరాల ప్రభాకరరావు 12వ వర్ధంతి సందర్భంగా మండలంలోని కంచికచర్ల, కీసర గ్రామాలలో దివంగత తంగిరాల ప్రభాకరరావు కాంస్య విగ్రహాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ సౌమ్య, ఉమా లతో కలిసి సోమవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే, మాజీమంత్రి లు మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోతారన్నారు. అటువంటి వారి సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. తంగిరాల ప్రభాకర్‌రావు ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ జీవితాన్ని కొనసాగించారని నాయకులు కొనియాడారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, అనంతరం ఎమ్మెల్యేగా ప్రజల విశ్వాసాన్ని సంపాదించి వారి హృదయాలను గెలుచుకున్న నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. ప్రత్యేకించి విద్య పట్ల ఆయనకు ఉన్న అభిమానం ఎంతో గొప్పదని, చదువుకోవాలనే తపన ఉన్న ప్రతి పేద విద్యార్థికి తన వంతు సహాయం అందించి ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచారని గుర్తుచేశారు.
రాజకీయాల్లో విలువలు, ప్రజల పట్ల అంకితభావం, సేవా తత్వం కలిగిన నాయకుడిగా తంగిరాల ప్రభాకర్‌రావు చిరస్మరణీయులన్నారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం దేవినేని వెంకటరమణ తంగిరాల ప్రభాకర్ రావులు ప్రజల హృదయాలలో నిలిచిపోతారన్నారు. పేదరికం నుంచి అంచలంచలుగా ఎదిగి, రాజకీయ రంగంలో తన సేవలతో ప్రజల హృదయాలను గెల్చుకున్న నాయకుడు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యార్డ్ చైర్మన్ కోగంటి బాబు, కూటమి నేతలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దివంగత నాయకుడికి ఘనమైన నివాళులు అర్పించారు.
