Collector Office | క‌లెక్ట‌రేట్‌లో మీకోసం..

Collector Office | క‌లెక్ట‌రేట్‌లో మీకోసం..

Collector Office | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమ‌వారం మీకోసం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ప్ర‌జ‌ల నుంచి క‌లెక్ట‌ర్ బాలాజీ, జేసీ న‌వీన్ అర్జీల‌ను స్వీక‌రించారు. వారు అనేక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి బాధితులకు ఊరటనిచ్చారు. 2025 సంవత్సరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనేక సమస్యలు పరిష్కరించారు. అయితే ఈ మీకోసం కార్యక్రమం 2025 సంవత్సరానికి ఇదే ఆఖరిది. ఈ రోజు ఆఖరి మీకోసం నిర్వహించి పాత సంవత్సరానికి వీడ్కోలు పలకనున్నారు. నూతన సంవత్సరకి ఆహ్వానం పలికి 2026 లో జనవరి 5వ తేదీన సోమవారం మరల మీకోసం కార్యక్రమం నిర్వహించనున్నారు.

Leave a Reply