గాదె వెంకటరెడ్డి మృతి పట్ల సుజనా చౌదరి దిగ్భ్రాంతి

గాదె వెంకటరెడ్డి మృతి పట్ల సుజనా చౌదరి దిగ్భ్రాంతి

భవానిపురం, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు క్రియాశీల పాత్ర పోషించిన సీనియర్ నాయకుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి పట్ల మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాదె వెంకటరెడ్డి మంత్రిగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారని సుజనా చౌదరి గుర్తుచేశారు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని కొనియాడారు. గాదె వెంకటరెడ్డి మరణం రాజకీయ రంగానికి తీరని లోటు అని సుజనా చౌదరి పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Leave a Reply