ప్రతిష్ట మహోత్సవం… పాల్గొన్న ఆర్టీసీ చైర్మన్

ప్రతిష్ట మహోత్సవం… పాల్గొన్న ఆర్టీసీ చైర్మన్
అవనిగడ్డ – ఆంధ్రప్రభ : అవనిగడ్డ నేరెళ్లపాలెంలోని సువర్చలా సమేత శ్రీ అభయ ఆంజనేయ స్వామి వార్ల దేవస్థానం నూతన విమాన శిఖరం, నూతన ఉత్సవ మూర్తుల ప్రతిష్ట మహోత్సవం, శాంతి కళ్యాణం ఘనంగా జరిగాయి.
ఆలయ పెద్దలు పర్చూరి దుర్గాప్రసాద్ ఆహ్వానం మేరకు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిని పర్చూరి దుర్గాప్రసాద్, కమ్మిలి సుబ్రహ్మణ్యం ఘనంగా సత్కరించారు. మాజీ ఉప సర్పంచ్ అడపా శ్రీను, కూటమి నాయకులు పాల్గొన్నారు.

