ప్రతిభకు వైఎన్ఆర్ చారిటీస్ ప్రోత్సాహం
– మెరిట్ విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ
ఉన్నత విద్యలో రాణించేందుకు డిజిటల్ సహకారం అందించిన కార్యక్రమం
విజయవాడ, ఆంధ్రప్రభ: తూర్పు, గన్నవరం నియోజకవర్గాలకు చెందిన 95 శాతానికి పైగా మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో ట్యాబ్లను పంపిణీ చేశారు.
విద్యార్థులు ఉన్నత విద్యలో మరింత రాణించేలా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా మెరిట్ సాధించిన విద్యార్థులను సత్కరించి ట్యాబ్లను అందజేశారు.
పదో తరగతిలో 582 మార్కులు సాధించిన కె. ఆదర్శ్, ఇంటర్మీడియట్లో 916 మార్కులు సాధించిన కరుణశ్రీ పొట్లూరి, పదో తరగతిలో 590 మార్కులు, ఇంటర్లో 990 మార్కులు సాధించిన నికితా శ్రీ రాలబండి, అలాగే ఇంటర్ బైపీసీలో 85 శాతం మార్కులు సాధించిన ఆశిష్ అడుసుమిల్లిని ఈ సందర్భంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిశోర్, మాజీ ఐఏఎస్ అధికారి ఎం.డి. ఇంతియాజ్, కామ్మా అసోసియేషన్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అధ్యక్షుడు గుమ్మడి రామకృష్ణ, కొల్లి వాసు, కొల్లి అజయ్, వైఎంఆర్ బాబు, చావా రఘు, డాక్టర్ భవన్ చంద్, పర్వతనేని బాబి, మాదు బోసుబాబు తదితరులు పాల్గొన్నారు.
