బీజేపీ సంస్థాగత స్థితి విస్తృతం..
- కొండపల్లి పట్టణ అధ్యక్షురాలు తమ్మినేని మాధురి
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : బీజేపీ సంస్థాగత స్థితిని విస్తృతం చేస్తున్నామని ఆ పార్టీ కొండపల్లి పట్టణ అధ్యక్షురాలు తమ్మినేని మాధురి తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 29న ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ కన్వెన్షన్ లో మైలవరం నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొండపల్లి బీజేపీ కార్యాలయంలో సోమవారం బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. బీఎల్ఏ 2, బూత్ కమిటీ ఇన్ చార్జిల సమావేశం ఇబ్రహీంపట్నంలో జరిపేందుకు నిర్ణయించి కార్యక్రమ విధివిధానాలను చర్చించారు. సమావేశంలో సర్ కార్యక్రమ కన్వీనర్ తుమ్మల శ్రీకుమార్, కో – కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు, రేగళ్ల రఘునాథరెడ్డి, చిగురుపాటి లక్ష్మి, దాము భవాని, కూనాల యుగంధర్, దుద్దుకూరి తిరుపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
