రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి సహాయం..

రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి సహాయం..

చందర్లపాడు, ఆంధ్రప్రభ : మండలం పాత బెల్లంకొండ వారి పాలెం గ్రామానికి చెందిన సవలం లక్ష్మీనారాయణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక భరోసా అందింది. సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వారి కార్యాలయంలో, ప్రధానమంత్రి జన సురక్ష భీమా పథకం కింద మృతుడి సతీమణి సవలం తిరుమలమ్మకు రూ.2 లక్షల భీమా మొత్తాన్ని కూటమి నేతలతో కలిసి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, అకస్మాత్తుగా కుటుంబ పెద్దను కోల్పోవడం బాధాకరమని, ఇలాంటి కష్టసమయాల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా తమ వంతు కృషి కొనసాగుతుందని తెలిపారు.

భీమా మొత్తంతో కుటుంబానికి కొంతమేర ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ వాసిరెడ్డి ప్రసాద్, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

Leave a Reply