కొండపల్లిలో ఉచితంగా చేపమందు పంపిణీ
కొండపల్లిలో ఉచితంగా చేపమందు పంపిణీ
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా ఉబ్బసం, దగ్గు, శ్వాసకోశ వ్యాధిగ్రస్థులకు కొండపల్లి ఆరు పంపుల సెంటర్ లో జనాబ్ హజీ హకీమ్ మొహమ్మద్ యూసఫ్ అలీ జ్ఞాపకార్ధం వారి మనుమలు మొహమ్మద్ మసూద్ అలీజిన్నా, మొహమ్మద్ మహమూద్ అలీ సోమవారం ఉచితంగా చేపమందు పంపిణీ చేశారు. వనమూలికలతో తయారు చేసిన మందును చేపకు పెట్టి మింగించారు. శాకాహారులకు అనుపానంతో ఇచ్చారు. ప్రతి ఏటా మృగశిరకార్తె రోజున ఉబ్బసమునకు ఉచితంగా చేప మందు పంపిణీ చేస్తున్నారు.
మంగళవారం సాయంత్రం వరకు చేప మందు పంపిణీ కొనసాగుతుంది. 1920 నుంచి తమ వంశస్థులు ద్వారా మొదలై నేటికి 106 సంవత్సరాలైందని మొహమ్మద్ మసూద్ అలీ జిన్నా, మొహమ్మద్ మహమూద్ అలీ చెప్పారు. చేపమందు తీసుకున్న వారు వరుసగా మూడు సంవత్సరాలు తీసుకోవాలన్నారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ఖమ్మం, ప్రకాశం, గోదావరి జిల్లాల నుంచి ఆస్తమా వ్యాధిగ్రస్థులు వచ్చి చేప మందును తీసుకున్నారు. జున్నుపాలు, వాలగ చేప, బూడిద గుమ్మడికాయ, వంకాయ, గోంగూర వంటివి దీర్ఘకాలం వాడకూడదని తెలిపారు.
