ప్రత్యర్థులను చిత్తు చేసిన ఏసీపీల జోడి

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; తెలంగాణ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో వరంగల్ పోలీస్ ఆఫీసర్స్ గోల్డ్ మెడల్ సాధించి సత్తాను చాటారు.55 ఏళ్ల గెజిటెడ్ అధికారుల బ్యాడ్మింటన్ విభాగంలో వరంగల్ కమిషనరేట్‌కు చెందిన ఏసీపీలు డాక్టర్ మూల జితేందర్ రెడ్డి,ఎలిగేటి మధుసూదన్ల జోడీ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.బ్యాడ్మింటన్ కోర్టులో పదునైన ఆటతీరను ప్రదర్శించారు.

ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆది నుండి ఆధిపత్యం ప్రదర్శనను చూపుతూ చిత్తు చేశారు. బ్యాడ్మింటన్ గేమ్ లో ఆల్ రౌండ్ ప్రతిభను చూపి ప్రథమ స్థానంలో నిలిచారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వేదికగా జరుగుతున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో వరంగల్ అధికారులు సత్తా చాటారు. డాక్టర్ మూల జితేందర్ రెడ్డి వరంగల్ పోలీస్ కమీషనరేట్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా కొనసాగుతున్నారు. ఇక ఎలిగేటి మధుసూదన్ వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Leave a Reply