Assembly | డిప్యూటీ సీఎం పవన్‌తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ

Assembly | డిప్యూటీ సీఎం పవన్‌తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ

Assembly | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కలిశారు. పలు అంశాలపై పవన్ తో బాలకృష్ణ చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆయన ఛాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు సమాచారం.

Leave a Reply