24వ డివిజన్‌కు అభివృద్ధి బాటలు…
మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : పాలమూరు నగర పాలక సంస్థ పరిధిలోని 24వ డివిజన్ అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన మూడు కోట్ల నిధులతో సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తామని కాంగ్రెస్ అభ్యర్థి గుమ్ముడాల రాధ గోవర్ధన్ గౌడ్ స్పష్టం చేశారు.నగరపాలక సంస్థకు మంజూరైన 38 కోట్లల్లో 24వ డివిజన్ కు మూడు కోట్లు మంజూరు అయ్యాయని,ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను, తాను కార్పొరేటర్‌గా గెలిస్తే స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో వెంటనే ప్రారంభించి అన్ని కాలనీల్లో సమాంతరంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలుస్తున్న అభ్యర్థి రాధ గోవర్ధన్ గౌడ్ ప్రచారంలో దూసుకుపోతూ గెలుపు ధీమాతో ముందుకెళ్తున్నారు. విగ్నేశ్వర కాలనీ, రబియా మజీద్, మధురానగర్, శ్రీరామ కాలనీ, నాగేంద్రనగర్ ప్రాంతాల్లో ఎన్నికల అనంతరం అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే పదవి లేకుండానే అభివృద్ధి చేసి చూపిన గోవర్ధన్ గౌడ్ కుటుంబ సేవలను గుర్తు చేసుకుంటున్న ఓటర్లు, రాధవైపు మొగ్గు చూపుతూ గెలుపు ఖాయమంటూ ఆశీర్వదిస్తున్నారు. ప్రత్యర్థుల ప్రచారానికి చమటలు పట్టే స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం కొనసాగుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
