గ్రామ అభివృద్ధికి ప్రత్యేక కృషి

గ్రామ అభివృద్ధికి ప్రత్యేక కృషి
నర్సింహులపేట, ఆంధ్రప్రభ: అభివృద్ధిలో గ్రామం ముందంజలో ఉందని వంతడపల గ్రామ సర్పంచ్ బాలు నాయక్ అన్నారు.
సోమవారం మండలంలోని వంతడపల గ్రామంలో నూతన వెలుగు కార్యాలయం (వీవో) నిర్మాణానికి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమారాణి, సీసీ రమణమ్మ, సీఏ శశిరేఖ, వీవో అధ్యక్షురాలు అలువాల రేణుక, సుజాత, వెంకటలక్ష్మి, వార్డు సభ్యులు లింగమ్మ, గ్రామ పెద్దలు బోళ్ల సంజీవరెడ్డి, పోలోజు శ్రీనివాస చారి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
