శాకాంబరిగా కశింకోట కనకదుర్గమ్మ…
కశింకోట, జులై 31( ఆంధ్రప్రభ ): ఆషాఢమాస పవిత్రవేళ కశింకోట కనక దుర్గమ్మ అమ్మవారు శుక్రవారం భక్తులకు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి మూలవిరాట్ తో పాటు ఉపఆలయాలను వివిధ రకాల కూరగాయలతో ప్రకృతిమాత స్వరూపంగా అలంకరించారు. మొదటిరోజు అమ్మవారు శాకంబరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.
