ప్రతి గడపకూ అభివృద్ధి..
ప్రతి కుటుంబానికీ సంక్షేమం…
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన టీడీపీ శ్రేణులు
అంబాపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు..
ఇంటింటికీ కరపత్రాల పంపిణీ
ప్రజా సమస్యల సేకరణతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన
అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని నాయకుల స్పష్టం
ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాలతో కార్యక్రమాల నిర్వహణ
విజయవాడ రూరల్ (వెస్ట్), జులై 31 (ఆంధ్రప్రభ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈసందర్భంగా పార్టీ నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా, పేదలకు గృహాల నిర్మాణం, మహిళా సంక్షేమ పథకాలు, యువతకు ఉపాధి అవకాశాలు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలతో కూడిన కరపత్రాలను అందజేస్తూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. మాజీ గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య మాట్లాడుతూ, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మార్గదర్శకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామాల్లో రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనకు భిన్నంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
గ్రామ టీడీపీ అధ్యక్షుడు మండల రాజేష్ మాట్లాడుతూ… ప్రజల విశ్వాసమే ప్రభుత్వానికి బలమని అన్నారు. గ్రామ స్థాయిలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా పార్టీ శ్రేణులు నిరంతరం కృషి చేస్తాయని చెప్పారు. గన్నవరం నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు చల్లగాలి సునీల్ మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచనల మేరకు ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు చేర్చడంతో పాటు పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్సీ నాయకుడు చిలువూరి ప్రభాకర్, తెలుగు యువత గ్రామ అధ్యక్షుడు కొమ్ము ప్రకాష్, చిలువూరి కుమార్‌బాబు, వెంకటరత్నం, సీనియర్ నాయకుడు సిద్దెల రాజా, అల్లూరి రామరాజు, కోట నరేష్, రాజేష్, శ్యామ్, సాల్మాన్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
