అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా..

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా..

  • 8వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోడెల లలిత గణేష్ యాదవ్

కల్వకుర్తి, ఆంధ్రప్రభ): మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపించాలని 8వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోడెల లలిత గణేష్ యాదవ్ ఓటర్లను కోరారు. ప్రజాసేవే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు ప్రజలు మద్ధతుగా నిలవాలని కోరుతున్నారు. ఎన్నికల్లో భాగంగా ప్రతిరోజు వార్డులో లలిత గణేష్ యాదవ్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డులో సొంత డబ్బులతో సిసి కెమెరాలు ఏర్పాటు తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇదే కాకుండా వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెబుతున్నారు. ఒక్క సారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు దడ పుట్టించేలా లలిత గణేష్ యాదవ్ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోడెల లలిత గణేష్ యాదవ్ ఓటర్లను కోరారు.

Leave a Reply