భారత్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి..

భారత్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి..
క్రీడాకారులను అభినందించిన మంత్రి వాకిటి శ్రీహరి
టి20 వరల్డ్ కప్ సాధించిన భారత క్రికెట్ జట్టు
యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
మక్తల్ , ఆంధ్రప్రభ : టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించడం పట్ల రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం భారత క్రికెట్ జట్టు సమిష్టి కృషి, పట్టుదల క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని సోమవారం ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి టోర్నమెంట్‌లో బలమైన జట్టైన న్యూజిలాండ్‌పై భారత ఆటగాళ్లు అద్భుత ప్రతిభ కనబరిచి దేశ ప్రజలకు గర్వకారణంగా నిలిచారని అన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సమన్వయంతో ఆడుతూ భారత జట్టు విజయాన్ని సాధించడం ప్రశంసనీయమని అన్నారు.
ఈ విజయంతో భారత జట్టు ప్రపంచ కప్ ప్రయాణంలో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఆశలు నెరవేర్చుతూ వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకుందన్నారు. భారత జట్టులోని ప్రతి ఆటగాడికి, కోచింగ్ సిబ్బందికి మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ విజయంతో దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు ప్రేరణ లభిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
