ఎమ్మెల్యే హామీతో శాంతించిన నిర‌స‌న‌కారులు

ఎమ్మెల్యే హామీతో శాంతించిన నిర‌స‌న‌కారులు

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal district) మల్దకల్ మండలం లో గత రాత్రి ఆత్మహత్యకు గురైన విద్యార్థిని ఉప్పరి ప్రియాంక(17) మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఈ రోజు మల్దకల్ బస్టాండ్ చౌరస్తాలో నిరసనకు దిగారు. రాంరెడ్డి గూడ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో చ‌దువుతున్న ఆమెకు ప్రేమ పేరుతో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్ప‌డిన‌ట్లు ఆరోపించారు.

“మా కూతురు మరణానికి ఓ యువకుడి కారణమని అ యువకుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆమెకు న్యాయం జరగాలి” అని తల్లిదండ్రులు, గ్రామస్తులు మృతదేహంతోనే ధర్నా చేపట్టారు. దీంతో గద్వాల-అయిజ (Gadwal-Aiza) ప్రధాన రహదారి పూర్తిగా స్తంభించింది. వందలాది మంది ప్రజలు సంఘటన స్థలానికి తరలి వచ్చారు. వాహనాలు, ఆర్టీసీ బస్సులు సుదీర్ఘంగా నిలిచిపోయాయి.

ఈ క్ర‌మంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (MLA Bandla Krishnamohan Reddy) అక్కడకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “ప్రియాంక మరణం వెనుక ఎవరున్నా వదిలిపెట్టం. కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయిస్తాను,” అని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో కుటుంబ సభ్యులు, బంధువులు శాంతించారు. ప్రియాంక మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply