electricity | రాంరెడ్డిపల్లిలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు

electricity | రాంరెడ్డిపల్లిలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు

electricity | మర్రిగూడ, ఆంధ్రప్రభ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజురైన విద్యుత్ స్తంభాలను గ్రామ సర్పంచ్ లపంగి నర్సింహా ఆధ్వర్యంలో రాంరెడ్డిపల్లి గ్రామంలో ఈ రోజు గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ప్రజా బాట’ కార్యక్రమంలో భాగంగా కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు.​ గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన సర్పంచ్ లపంగి నర్సింహా, ఎమ్మెల్యే దృష్టికి సమస్యలను తీసుకెళ్లి ఈ పనులను మంజూరు చేయించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల కనీస అవసరాలను తీర్చడమే తమ ప్రాధాన్యతని, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తోడ్పాటుతో రాంరెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కారింగు నర్సింహా, సీనియర్ నాయకులు వెన్నమనేని సుధాకర్ రావు, దామోదర్ రావు, లైన్మెన్ వెంకన్న, వార్డు మెంబర్ లపంగి మహేందర్, పగిళ్ల శంకర్, బలుసుల సోమయ్య పాల్గొన్నారు.

Leave a Reply