Taxi | రోజుకు రూ.30..

Taxi | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ ; రవాణా రంగంలో నూతన అధ్యాయానికి తెరలేపుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా వినూత్న ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలకు దీటుగా, జీరో కమిషన్ విధానంతో భారత్ టాక్సీ’ సేవలు నడవనుంది. ఇది దేశంలోనే తొలి సహకార ఆధారిత రైడ్-హైలింగ్ సంస్థ. ఇందులో బైక్, ఆటో, కార్ల సేవలు ఇందులో లభిస్తాయి. డ్రైవర్ల కష్టార్జితం వారికే దక్కేలా, ప్రయాణికులకు తక్కువ ధరకే సేవలు అందేలా, రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఈ సేవలు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది కేంద్రం. ఈ ప్లాట్‌ఫామ్ ప్రపంచంలోనే అరుదైన సహకార నమూనాగా కేంద్రమంత్రి అమిత్ షా అభివర్ణించారు.
కేవలం లాభాపేక్ష కాకుండా సారథి సమాజం, ప్రయాణికుల మేలే లక్ష్యంగా వాహనాలు తిరుగుతాయని అమిత్ షా అన్నారు. సారథి హి మాలిక్ అనే సూత్రంతో నడిచే ఈ సంస్థలో చేరే డ్రైవర్లు ఐదు షేర్లు కొనుగడంతో యజమానుల హోదా పొందుతారు. వీరు రోజుకు కేవలం రూ.30 రూపాయాలు చెల్లిస్తే సరిపోతుంది. డ్రైవర్ల కోసం రూ.5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, రూ.5 లక్షల కుటుంబ ఆరోగ్య బీమాతో పాటు రిటైర్మెంట్ సేవింగ్స్ కుడా కల్పిస్తున్నారు. ఈ యాప్ లో మూడు లక్షల మందికి పైగా డ్రైవర్లు ఇందులో చేరారు. ఇప్పటికే ఢిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్ ప్రాంతాల్లో ఈ సేవలు విజయవంతమైంది.
